లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేస్తోన్నా. మా డిపార్ట్ మెంట్ నేను డాక్టర్ ని కావటం వల్ల పోలీసుల కోసం జీవన శైలి సమస్యల పైన దృష్టి పెట్టవలసి వస్తోంది వారి ఆరోగ్య బాధ్యత కూడా నాదే కానీ మా ఇద్దరమ్మాయిల ను మాత్రం బాగా మిస్ అవుతున్నాను. పెద్ద పాపకు పదేళ్ళు చిన్న పాపకు నాలుగు. ఇంటికి వెళుతూనే నేను కనబడగానే మీదికి రాకుండా ఆపటం చాలా కష్టంగా ఉంది అంటున్నారు నాశిక్ గ్రామీణ ఎస్పీ ఆర్తీ సింగ్ నా భర్త ముంబయ్ లో ఐఏఎస్ అధికారి ఇద్దరము విధుల్లో ఉన్నాం. జిల్లా ప్రజలు,నాలుగు వేల మంది పోలీస్ లు నా బాధ్యత. పిల్లల కోసం ఎంత రాత్రయినా ఇంటికి వెళతాను కానీ వాళ్ళని దగ్గరకు తీసుకొనే అవకాశమే లేదు. వీధుల్లో నిలబడి విధులు నిర్వహించే పొలిసుల బాధ్యతే నాకు ఎదురుగ్గ ఉంది అంటున్నారు ఆర్తీ సింగ్