వర్షాలు మొదలయ్యాయి చేతిలో గొడుగు ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది .ఉండేదో స్టయిల్ గా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది కదా ? అనుకున్నట్లు గానే గొడుగులు స్మార్ట్ గా ఈనాటి త్రీడి పరిజ్ఞానం వెంటబెట్టుకుని వచ్చి మరీ కనువిందు చేస్తున్నాయి .ఫ్యాషన్ డిజైన్ లలో కొత్త ట్రెండ్ ఈ త్రీడి గొడుగులు పైగా మరి పెద్దవి కాకుండా మినీ అంబ్రెల్లా లు స్టయిల్ గా చిన్న బ్యాగ్ లో పట్టేవి చాలా రకాలే ఉన్నాయి.  అరటిపండు బొమ్మ, కాప్సూల్ ఫ్లవర్ వేజ్ పెర్ ఫ్యూమ్ బాటిల్ ఇలా ఎన్నో రూపాల్లో అవేవో షోకేస్ లో పెట్టవలసిన అందమైన బొమ్మ లాగా ఉన్నాయి. నీటిని పీల్చని పాండీ పాలియస్టర్ ఫ్యాబ్రిక్ తో తయారైన ఒవెన్ కైన్ గొడుగుని కింద పెడితే పడిపోకుండా నిలబడి ఉంటుంది. ఫోన్ బ్రెల్లా గొడుగుని బ్లూటూత్ ద్వారా ఫోన్ కి కనెక్ట్ చేసుకుని ఎంచుకున్న పాటలు వింటూ నడిచి పోవచ్చు .ల్యుమినస్  ట్రాన్స్ పరెంట్  అంబ్రెల్లాలు రాత్రివేళ నడిచి వెళ్తుంటే గొడుగు మొత్తం వెలుగులు వెదజల్లుతాయి. రంగులు మారుతూ ఏడు రంగుల్లో వెలిగే ఎల్ ఇడి గొడుగులు చుట్టూ ఉన్న కళ్ళన్నీ దానిపైనే ఉండిపోతాయి. ఇంకో చిత్రం ఇప్పుడు కష్టమైజ్ గొడుగులు వచ్చాయి. మన కిష్టమైన వ్యక్తులు పెంపుడు జంతువులనో గొడుగు పైన ఫోటోలు పెట్టుకోవచ్చు .చక్కగా గొడుగు తెరిస్తే లోపల మొత్తం ఫోటోలు కనువిందుచేస్తాయి. ఇక ఆంబియంట్ అంబ్రెల్లాలు వాన రాకడను హ్యాండిల్ లోని సెన్సార్ ద్వారా గ్రహించి చెబుతాయి. మరి గొడుగు గా ? మజాకా నా ?

Leave a comment