జుట్టు ఒత్తుగా పెరగాలంటే మాడు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి.మాడకు స్క్రబ్ చేయాలి అలా చేయడం వల్ల సేబాషియన్ గ్రంధులు ఉత్తేజితమై జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.జుట్టుకు కూడా పోషకాలు అందాలంటే గుండ్రని పళ్ళున్న దువ్వెనతో జుట్టు బాగా దువ్వాలి. హెయిర్ డ్రయ్యర్ వాడితే వేడి తక్కువగా ఉండాలి. ప్రతి రోజూ తల స్నానం మంచిది కాదు. స్నానం తర్వాత కాటన్ బట్టతో జుట్టు  తుడుచుకోవాలి. ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత జుట్టు పై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. సమతులాహారం తీసుకొంటూ శరీర ఆరోగ్యం కాపాడుకుంటూనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment