ప్రపంచంలో మొట్టమొదట నీటి అడుగున నిర్మించిన హోటల్ విల్లా ది మురాక క్రావ్రాడ్ మాల్దీల్స్ రంగాలి ఐలెండ్ లో రెండు అంతస్థుల్లో నిర్మించిన ఈ విల్లాలో కింది అంతస్థు సముద్రం లోపల 16 అడుగుల లోతున ఉంది. మొత్తం అద్దాలతో నిర్మించిన ఈ కింది అంతస్థు లోకి వెళితే నీటి మధ్యలో ఉన్నట్లే ఉంటుంది. ఆ అద్దలోంచి ఎన్నెన్నో సముద్రపు జీవులు హాయిగా ఈదుతుంటాయి . ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అక్వేరియంలో మనుషులు బయట నీళ్ళూ చేపలూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ తార కాజల్ అగర్వాల్ హనీమూన్ కి ఈ హోటల్ ని ఎంచుకొని అక్కడ భర్తతో ఫొటోలు దిగితే అవన్నీ సోషల్ మీడియాలో వైరల్. ఈ హోటల్ కాస్తా వార్తల్లోకి వచ్చింది. ఆరువందల టన్నుల బరువున్న మురాక హోటల్ ని మొదటి అంతస్థుని సింగపూర్ లో నిర్మించి మాల్దీవులకు తెచ్చి సముద్ర తీరానికి కొద్దీ దూరంలో నీటిలో అమర్చారు ఇందుకోసం 110 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పర్యాటకుల్ని ప్రధాన రిసార్ట్ నుంచి ప్రైవేట్ సీ ప్లేస్ లో లేదా స్పీడ్ బోట్ లో ఈ విల్లాకి తీసుకువెళతారు. స్టీలు,కాంక్రిట్,అక్రిలిక్ లతో కట్టిన ఈ విల్లాలో అడుగున ఉండే మొదటి అంతస్థులో ఒక్కటే మాస్టర్ బెడ్ రూమ్ ఉంటుంది. చుట్టు సముద్రం పైన ఆకాశం కనిపించే ఈ మురాక విల్లాలో ఒక రోజు బస చేయాలంటే 37 లక్షలు కట్టాలి.

Leave a comment