ఇక వర్షాలు మొదలయ్యాయి. నిద్ర లచే సరికి వాన పడుతూ ఉంటే ఇంకా వాకింగ్ కు వెళ్లాలనిపించదు. అలాటప్పుడు మెట్లు ఎక్కిదిగచ్చు,నడకలో ఖర్చయ్యే కాలరీలు కంటే రెండింతలు ఖర్చవుతాయి. కాళ్ళలో విభిన్న కండరాలకు పని చెప్పినట్లు అవుతోంది. తొడలు, కాలి మడమలు కండరాలకు కూడా వ్యాయామం లభిస్తుంది. మెట్లెక్కుతూ పక్కన గల రెయిల్స్ పై చేతుల్ని పెడుతూ ఉంటే ముంజేతులు  భుజాల్లోని కండరాలకు కూడా ఎక్సర్ సైజు లభిస్తుంది ఇలా చేయడం వల్ల కండరాలు స్ట్రెంత్ పెరుగుతుంది. గుండె, ఊపిరి, తిత్తులు బలోపేతం అవుతాయి గుండెకు ప్రయోజనకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. వయసులో పెద్ద వాళ్లు వారానికి 150 నిమిషాలు వర్క్ వుట్స్ చేయాలి మెట్లు ఎక్కాలి అనుకుంటే అవి చిన్నవిగా ఎత్తు తక్కువగా ఉండాలి. మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఎక్కాలి ప్రతి రోజూ పది నిమిషాల చొప్పున చేస్తుంటే చాలు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక్కసారి పది నిమిషాల చొప్పున రోజుకు మూడుసార్లు మెట్లెక్కుతూ ఉంటే సిఫార్స్ చేసిన శారీరక  వ్యాయామ స్థాయిలను అందుకున్నట్లే. అయితే బ్యాలెన్స్ సమస్యలు ఉన్న భుజాలు మోకాళ్లు, మడమలు, పాదాల్లో నొప్పి ఉంటే ఈ మెట్లెక్కే వ్యాయామం అసలు కుదరదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఈ మెట్లెక్కే వ్యాయామం చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఎక్కువ ప్రాణవాయువు తీసుకొంటాం కనుక గుండె ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఒత్తిడిగా అనిపిస్తే ఈ వ్యాయామంతో ఎండార్షిన్ విడుదలై ఒత్తిడి అదుపులోకి వస్తుంది. మానసిక స్వాంతన లభిస్తుంది.

Leave a comment