మోహం తీర్చిదిద్దినట్లు తీరైన కనుబొమ్మలు, ఎర్రని పెదవులు, కాటుక దిద్దిన కళ్ళతో ఎప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా.అలా కలలు కనే వారికోసం పర్మనెంట్ సెమీ పర్మనెంట్ టాటూ వచ్చేసింది. ఎలాంటి మేకప్ చేసుకున్నా కొన్ని గంటల్లో చెదిరిపోతుంది. కానీ మొహంలో ఉండే చిన్న చిన్న లోపాలను సరి చేస్తూ వచ్చిందే పర్మనెంట్  మేకప్ .ఇదోరకం పచ్చబొట్టు లాంటిది ఫ్యాషన్ కోసం పచ్చ బొట్టు వేయించుకున్నట్లు ఒత్తుగా కనుబొమ్మలు కనిపించేందుకు, రంగైన పెదవులు, ముఖంపై మచ్చలు లేని చర్మం ఇదంతా పచ్చబొట్టు పద్ధతిలో వేస్తారు. ఇప్పుడు అందమైన పెదవులు కావాలంటే పచ్చబొట్టు లిప్ లైనర్ గా వేసి ముఖ ఆకృతికి తగ్గట్లు పెదవులు మారుస్తారు. చర్మ తత్వాన్ని బట్టి సెమీ పర్మనెంట్ ముఖంపై నిలువ ఉంటుంది. ఇది మేకప్ లాగా కాకుండా సహజమైన అందమే అన్నట్లు ఉంటుంది కనుక రంగులు చెదిరిపోతున్న సమయంలో కూడా అసహజంగా ఏమి ఉండదు. ఇక పర్మనెంట్ మేకప్ రెండున్నర ఏళ్ళు గ్యారంటీ అంటున్నారు నిపుణులు .తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా ఈ చికిత్సను చేసే బ్యూటీ పార్లర్ లు ఉన్నాయి. ఈ మేకప్ గురించి క్షుణ్ణంగా తెలిసిన ఎక్సపర్ట్ దగ్గరే ఈ చికిత్స వంటి మేకప్ చేయించుకోవాలి.

Leave a comment