Summer Rayne oakes అమెరికా కు చెందిన ఫ్యాషన్ మోడల్, పర్యావరణ ఉద్యమ వేత్త, రచయిత్రి కూడా .న్యూ యార్క్ లోని ఆమె నివసించే 1200 చదరపు అడుగులు ఇల్లు మొత్తం 1100 కుండీలతో నిండి ఉంటుంది . ఎన్విరాన్ మెంటల్ సైన్స్,ఎంటమాలజీ లో డిగ్రీ చేసిన రెయిన్ కు ప్రయోగాలు ఇష్టం. అందులో భాగంగానే తన ఇల్లుని ఒక అరణ్యం లాగా మార్చేసింది. ఆమె ఇంట్లో ఫర్నిచర్ కూడా దాదాపు వీధి లో దొరికే చెక్కతో తయారు చేసినవే. పర్యావరణాన్ని గురించి ప్రచారం చేసేందుకు ఇలా ఇల్లంతా చెట్లతో నింపేనంటుంది రెయిన్. బాల్కనీ, బాత్రూం, వంటిల్లు, పడకగది ,హాలూ ఇటు ఎటు చూసినా పచ్చని మొక్కలే ఉంటాయి. పుస్తకాల షెల్ఫ్ లు కూడా పూల కుండీలతో అలంకరించుకుని కనిపిస్తాయి. గోడలకు అల్లుకొన్న తీగలే ఫోటోలు పెయింటింగులూ, టేబుల్, కుర్చీ, ఫ్రిజూ సమస్త వస్తువులు చుట్టూ పూలకుండీలు కనిపిస్తాయి. వీటన్నింటికీ  నీళ్ళు పోసేందుకు రోజుకు అరగంట మాత్రమే పడుతుందట వారానికి ఒకసారి కత్తిరించటం, ఎరువులు వేయడం కోసం ఇంకో గంటన్నర కేటాయిస్తోందట, తన వృత్తికి ఈ మొక్కల పెంపకం ఏ మాత్రం అడ్డు రాదు అంటుంది రెయిన్. నేను ప్రకృతి కి జన్మించిన పాపాయిని అందుకే నా చుట్టూ ఈ పచ్చదనం… నాకిందులో సంతోషం దొరికింది అంటుందీ  ప్రకృతి ప్రేమికురాలు .

Leave a comment