ఇప్పుడు ఫ్యాషన్ దుస్తుల పరంపరలో కి రెయిన్ కోట్స్ కూడా వచ్చి చేరాయి. వర్షం చుక్క కూడా మీద పడకుండా రక్షణ గా ఉండేందుకు చల్లని గాలిలో వెచ్చదనాన్ని ఇచ్చేందుకు కూడా కొత్త మోడల్స్ రెయిన్ కోట్లు వచ్చాయి .1200 వందల ఏళ్ళ క్రిందట రబ్బర్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ తో వాటర్ ప్రూఫ్ గార్మెంట్స్ తయారు చేసినట్లు చరిత్ర కథనం. 1824 లో స్కాటిష్ కెమిస్ట్ చార్లెస్ మాకి స్తోష్ టార్పాలిన్ ఫ్యాబ్రిక్ తో వాటర్ ప్రూఫ్ రెయిన్ కోట్ తయారు చేశారని అధికారికంగా నమోదయింది .ఇక అప్పటి నుంచి డిజైనర్లు రకరకాల రెయిన్ కోట్స్ సృష్టించారు .లాంగ్ రెయిన్ కోట్ పాదాల వరకు ఉండటం వల్ల కాళ్లు పొడిగా ఉంటాయి .ప్యాంట్, షర్ట్, కుర్తా, శారీ సంబంధించిన ఈ లాంగ్ రెయిన్ కోట్ అందంగానే ఉంటుంది .సన్నటి వర్షంలో నడిచేందుకు బాగుంటుంది. ఇక వెయిస్ట్ లెంగ్స్ రెయిన్ కోట్స్ స్పోర్ట్స్ లుక్ ఇస్తుంది.జీన్స్ ప్యాంట్ స్కర్ట్ వంటి కొన్ని డ్రెస్ లకు చక్కగా మ్యాచ్ అవుతుంది. షివర్ మ్యాన్ కోట్ ఈ సీజన్ లో సరైన ఎంపిక నడుము దగ్గర బెల్ట్ లా ఉండే ఈ కోట్ చాలా స్టయిల్ గా ఉంటుంది. ఇకపోతే ఎల్లో కలర్ రెయిన్ కోట్స్ కే ఎక్కడలేని డిమాండ్ .ఎప్పుడో 19వ శతాబ్దంలో నార్స్ ఐర్లాండ్ లో సముద్ర యానం చేసే స్కాట్స్ ని గుర్తించేందుకు పసుపు రంగు కోట్లు తయారు చేశారట ఇప్పుడు కూడా పిల్లలు బయట ఆడుకునేప్పుడు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు వర్షం లో ఉన్నా స్పష్టంగా కనిపించేందుకు పసుపు రంగు ఎక్కువ రెయిన్ కోట్స్ కొంటుంటారు.సాదాసీదాగా ఉండే రెయిన్ కోట్ కాస్త ఫ్యాషన్ ఐకాన్ లాగా మారిన మాట వాస్తవం !

Leave a comment