Categories
లాక్ డౌన్ లో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన వేళలో ప్రజలను ఎక్కువ ఎంటర్టైన్ చేసింది టిక్ టాకే నని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో ఎక్కువ కాలం కోట్ల మంది టిక్ టాక్ ను చూస్తున్నారట. హ్యాండ్ వాష్ చాలెంజ్ లు వంటివి టిక్ టాక్ లో విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా స్కిట్స్ కరోనా జోకుల తో టిక్ టాక్ యూజర్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది అట ఇళ్లల్లో నే చేసే డాన్సులు, వంటలు విపరీతంగా అన్ లోడ్ చేశారు. కానీ కాసేపైనా నవ్వించే టిక్ టాక్ లు చూసి ప్రజలు రిలాక్స్ అయ్యారని టిక్ టాక్ వుయంగ్ వెల్లడించింది. ఇది మంచి పరిణామమే కానీ ప్రమాదకరమైన విన్యాసాలు చేయకండి, సరదా కోసం వినియోగించండి అంటూ హెచ్చరిస్తున్నారు మానసిక విశ్లేషకులు.