Categories
వేసవి లో చల్లని పానీయం తాగాలనుకుంటే సబ్జా గింజలు వేసిన ఫలుదా తాగవచ్చు. నీళ్లలో సబ్జా గింజలు వేసి తాగితే ఎండ వేడి నుంచి రక్షణ ఉంటుంది.ఎక్కువగా పీచు ఉంటుంది కనుక కడుపు నిండిన భావన కలుగుతుంది.నిమ్మకాయ నీళ్లు షర్బత్ లతో,మిల్క్ షేక్ ల్లో చల్లదనం కోసం సబ్జా గింజలు నీళ్లు తాగవచ్చు.ఫ్రూట్ సలాడ్ లో కూడా నానిన సబ్జా గింజలు కలుపుకోవచ్చు.శరీరంలో వ్యర్థాలు బయటకి పోయేలా చేస్తాయి సబ్జా గింజలు.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి పిండిపదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా సాయపడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.