పూర్ణిమా దేవి వన్యప్రాణి జీవ శాస్త్రవేత్త.  ఆమె కొంగల్ని కాపాడేందుకు కృషి చేశారు అస్సాంలోని కమ్రుప్ జిల్లా బెగ్గురు కొంగలకు ప్రసిద్ధి.  అవి కళేబరాలను తింటూ ఎముకలు మాంసం ఇళ్లపై పడవేసి ఊర్లో చెట్టు పైన ఉండేవి.వీటిని కొట్టేస్తే కొంగలు బాధ పోతుందని స్థానికులు చెట్లు నరకడం మొదలు పెట్టారు.ఆ కొంగల ఆర్తనాదాలకు చెలించిన పూర్ణిమ అక్కడ మహిళల్ని కూడగట్టుకొని చెట్లు కొట్టకుండా కాపాడండి ప్రతి పల్లె తిరిగి ప్రకృతి గొప్ప తనం వివరించింది.అరుదైన కొంగల జాతి వల్ల పర్యావరణానికి జరుగుతున్న మేలు వివరించాక గ్రామస్తులు చెట్లు కొట్టటం ఆపారు.పూర్ణిమా దేవి కృషితో ఆ ఊరు నిండా కొంగలున్నాయి.

Leave a comment