Categories
చాలా మంది పిల్లలకు నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది ఈ అలవాటు మాన్పించడం చాలా కష్టం. బేబీ ఫింగర్ గార్డ్ తో ఈ అలవాటు మాన్పించ వచ్చు. ఈ బేబీ ఫింగర్ గార్డ్ వేలికి తొడిగే లా తయారు చేశారు. వెల్లులా ఉండి దానికి సిలికాన్ తో చేసిన వేలి ఆకృతి ఉంటుంది. దాన్ని వేలికి పెట్టి వెల్లుని మణికట్టుకు చుట్టేస్తే పిల్లలు దానిని తేలికగా తీయలేరు. ఆ సిలికాన్ వేలిని నోట్లో ఉంచుకోవటం నచ్చక చాలా కొద్దికాలంలో నోట్లో వేలు పెట్టుకోవడం మానేస్తారు. ఇది శుభ్రం చేయటం చాలా తేలిక.