పెరూ ఆర్ధిక మంత్రి మరియా ఆంటోని నిటా. లాక్ డౌన్ లో అన్ని దేశాలతో పాటు పెరూలో కూడా గడ్డు పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో మరియా అత్యంత సమర్ధవంతంగా జనం హృదయాలు గెలుచుకున్నారు . పేద కుటుంబాలను ఆదుకొనేలా భారీ ప్యాకేజీలు చిరు వ్యాపారులకు ఆర్ధిక ప్రయోజనాలు ప్రకటించారు. అక్కడ ఆకలి చావులు పేదల కష్టాలు లేవు. ఈ ఫలితాలే ఆమె కీర్తిని పెంచాయి. సంక్షోభ సమయంలో పెరూ ఆర్ధిక వృద్ధి రేటును గణనీయంగా పెంచగలిగారు 35 సంవత్సరాలకే ఆ పదవి అలంకరించిన తోలి మహిళగా రికార్డ్ సృష్టించారు.