Categories
పనితో పాటు నా చుట్టు పక్కల వాతావరణం కూడా నాకు ఇష్టమైన పోతుంది. షూటింగ్ ప్లేస్ కూడా వెంటనే నచ్చుతోంది. అందుకే ఎంత సేపు కష్టపడ్డ అలసట ఉండదు. పనిని ప్రేమిస్తే కష్టం ఏం తెలుస్తుంది అంటుంది అనూపమ పరమేశ్వరన్. తన కేరీర్ గురించి మాట్లాడుతూ ,సినిమా వాతావరణం ఇప్పుడు బాగా అలవాటైంది. ఎంతో మంది స్నేహితులు దొరికారు. నావన్నీ చిన్న చిన్న టార్గట్స్. ఇప్పుడే మొత్తం సాధించాలనే ఆలోచనలు నాకు రావు. నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రతి చిన్న సంఘటననీ ఆస్వాధిస్తూ ఆనందిస్తూ వెళుతున్నా. నా ఆలోచనలన్నీ సినిమాల చుట్టునే నడుస్తాను…ప్రతి జ్ఞాపకం పదిలంగా ఒక పెన్నిధిలాగే ఉంటుంది. నాకు ఇవే ఆస్తులనుకొంటాను నేను అంటోంది అనుపమా.