Categories
కేరళ రాజకీయాల్లో ఎక్కువ కాలం పనిచేశారు కెఆర్ గౌరీ అమ్మ తాజాగా 102 వ పుట్టినరోజు చేసుకున్నారు 1919 లో అలెప్పీ ఏత్తావాక్కడ లో జన్మించిన గౌరీ అమ్మ ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతారు.1948లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన సంవత్సరమే అరెస్ట్ అయ్యి మొదటిసారి జైలుకు వెళ్లారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టి.వి థామస్ తో ఆమెకు వివాహం అయ్యింది. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇద్దరు కేరళ రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వందేళ్లు దాటినా గౌరీ అమ్మ ఇప్పటికీ చురుకుగానే ఉన్నారు.ఆమె ఆరోగ్య రహస్యం ఆహారం అంటారు గౌరీ సాహసాలు, సవాళ్లతో కూడిన రాజకీయ జీవితం కొనసాగించిన ఈ కమ్యూనిస్టు నాయకురాలు సాటి రాజకీయ నాయకులకు ఆదర్శం.