Categories
శ్రావణ మాసం మొదలైంది.బెనారస్ చీరె తోనే శ్రావణమాస కళ ఇంటి కోస్తుంది.వెండి బంగారు జరీతో నేనే బెనారస్ చీరెలు ఎంతో కాలం మన్నికగా ఉంటాయి. నేత రంగును బట్టి ఉత్సవాల్లో పండుగల్లో కట్టుకునే చీరెలు ఇవి.వసంత కాలంలో పసుపు వర్ణపు చీరెలు వేసవిలో తెల్లని చీరెలు మధ్యాన్నలలో, ఉత్సవాల్లో ముదురు రంగు చీరెలు కట్టుకుంటారు.ఈ బెనారస్ చీరెలకు పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి. చక్కని సిల్వర్ మోటిఫిల్ రంగుల మేళ వింపుతో అందమైన కొంగుల తో బెనారస్ చీరెలు ప్రత్యేకం.అంచుల పైన అల్లుకొన్న మోటిఫ్ తో పల్లు నిండుగా జారీ తీగలతో అల్లిన డిజైన్ లతో శ్రావణ మాస కళను తెచ్చే బనారస్ చీరెలు బరువు కూడా తక్కువే సరికొత్త చీరెల కోసం ఆన్ లైన్ లో చూడచ్చు