హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు రోష్ని నాడార్ మల్హోత్ర. భారత్ లో లిస్టెర్ ఐటి కంపెనీ చైర్మన్ పదవి చేపట్టిన తొలి మహిళ రోష్నినే.ఆమె ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సి.ఇ.ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అలాగే శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా ఉన్నారు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న రోష్ని ముందుగా యు.కె లోని స్కై న్యూస్ సి.ఎన్.ఎన్ అమెరికా చానళ్ళలో న్యూస్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.2009లో హెచ్ సి ఎల్ కార్పొరేషన్ లో చేశారు.హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె వ్యక్తిగత ఆస్తి 36 800 కోట్లు .2019లో ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబిదా లో రోష్ని నాడార్ కు 54 వ స్థానం లభించింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం 2018లో ది హాబి టాట్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది రోష్ని.