Categories
ఒక్కసారి ఎండలో ఎక్కువసేపు గడిపే వాళ్లలో శరీర వర్ణం తోపాటు పెదవుల రంగు మారుతుంది.కాఫీ లు తాగితే పెదవులు మాటి మాటికీ తడపటం కొరికే అలవాటు కొద్ది కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఉంటుంది.విటమిన్ల లోపం హార్మోన్ల అసమతుల్యత అతి డైటింగ్ కాస్మెటిక్స్ వాడకం నాణ్యత లిప్స్టిక్ ల వినియోగం కూడా పెదవుల రంగులేని నలుపుగా చేయచ్చు.ఈ రంగు మారితే చికిత్సలు ఏమీ ఉండవు గానీ సరైన లిప్ బామ్ రాసుకొంటూ ఉంటే చాలు బయటకు వెళ్ళినప్పుడు ఎస్.పి.ఎఫ్ 30 ఉన్న లిప్ బామ్ రాసుకోవాలి. లిప్ స్టిక్ వాడకం కొన్నాళ్లు మానేస్తే మంచిది. వీటిలో చర్మానికి హాని చేసే లెడ్ మెర్క్యూరీ వంటి లోహాలుంటాయి.