ఉస్తాద్‌ జాకిర్‌ అలీ హుసేన్‌,ఉస్తాద్‌ అల్లారఖా వంటి తబలా విద్వాంసులు లాగా పేరు గణించింది పండిత్ అనురాధా పాల్.ఎం.ఎఫ్‌.హుసేన్‌ తీసిన ‘గజ్‌గామిని’ సినిమాకు ఒక్కతే తబలా వాయిస్తూ రీ రికార్డింగ్‌ చేసింది అనురాధా పాల్.తబలా ఒక్కటే వాయిద్యంగా రీ రికార్డింగ్‌ పూర్తిచేసుకొన్న చిత్రం అదొక్కటే కావచ్చు కూడా. ముంబై కి చెందిన అనురాధా పాల్. 18 ఏళ్ల వయసులో కచ్చేరి ఇస్తే ఆమెను ‘లేడీ జాకిర్‌ హుసేన్‌’ అనే బిరుదు ఇచ్చారు. 40 రకాల వాయిద్యాలను ఒక్కతే వాయిస్తూ ఒక ఆల్బమ్ చేసింది ఆమె అందరూ మహిళా విద్వాంసులే ఉండే స్త్రీ శక్తి అనే బ్యాండ్ ను తయారు చేసి అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు అనురాధా పాల్‌.

Leave a comment