Categories
Nemalika

ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకోవాలి.

నీహారికా,

చాలా మందిని చూస్తుంటాం. కొత్తగా జాబ్ లో చేరతారు. తుళ్ళు తో సంతోషంగా కనిపిస్తారు. ఓ సవత్సరం అవే సరికి వాళ్ళలో ఓ నిరాసక్తత కనపడుతుంది. ఎదో ఒక అనారోగ్యం ఉందని మాట్లాడుతుంటారు. మానసిక వత్తిడి తో దహించుకు పోతుంటారు. విపరీతమైన పనిభారం, ఇంటా బయట పని, శ్రమకు తగిన వేతనం లేకపోవటం, రోజులు తరబడి మార్పులేని పని, దీనితో లోలోపల ఉచ్చాహం, పని పట్ల ప్రేమ, ఉద్విగ్నత లోలోపల దగ్ధమైపోతాయి. ఎందుకొచ్చిన ఈ చావురా అన్నట్లుంటారు. అయితే ఇలాంటి స్తితి రాకుండా ఉండేందుకు మన లోపల చైతన్యం సమర్థవంతంగా పని చేయాలి.ఉద్యోగం లో  ఓ లక్ష్యం, మన జీవిత ప్రయనానికో గమ్యం దేనికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దానికి ఇవ్వటం చేస్తూ పోవాలి.  ఉద్యోగం జీవితాన్ని పర్సనల్ జీవితాన్ని కలిపివేయకూడదు. ఉద్యోగం ఆదాయ మార్గం దాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. పర్సనల్ లైఫ్ మనం నిర్ణయించుకోవలసిన  మన సామ్రాజ్యం. ఇందులో మన సంతోషం, కుటుంబ బాద్యతలు, పిల్లల పెంపకం ఇవన్ని ఉన్నాయి. దీని ప్రేమగా బుజానికి ఎత్తుకోవాలి. ఈ ప్రయాణంలో విసుగు రాకుండా చూసుకొనే భాద్యత కూడా మనదే. కీలకమైన పనులు నిర్ణయించుకొని ఒక పద్ధతి ప్రకారం చేసేందుకు అలవాటు పడాలి. అప్పుడే ఏ వత్తిడులు దగ్గరకు రావు.

Leave a comment