
సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బాక్సింగ్ మాత్రం మానలేదు ఇప్పటికీ ప్రతి రోజూ ప్రాక్టీస్ చెయ్యాల్సిందే నా జీవితం లో బాక్సింగ్ ఒక భాగం,క్రీడాకారిణి అనిపించుకోవటం లో నాకు ఆనందం ఉంది అంటుంది రితికా సింగ్.గురు లో కిక్ బాక్సర్ గా కనిపించిన నేను నిజ జీవితంలో కూడా బాక్సర్ నే మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ ని. 2009 లో ఏషియన్ ఇండోర్ గేమ్స్ లో ఆడి పతకం గెలుచుకున్న.ఎన్నో బాక్సింగ్ లీగ్స్ లో పాల్గొన్న.అప్పుడే నన్ను చూసి సుధా కొంగర గురు మూడు బాషల్లో నన్నే ఎంచుకున్నారు.భాష కి ఒకటి చొప్పున మూడు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. అప్పటి నుంచి సినిమాలే జీవితం అయిపోయాయి. కానీ బాక్సింగ్ మాత్రం నాతోనే ఉంటుంది.