నవజాత శిశువుల పై అధ్యయనాలు ఎన్నో జరుగుతున్నాయి.  భారతీయ శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. పుట్టినప్పుడే వీరి కడుపు భాగంలో కాలేయంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అడిపోనెకిల్ ప్రోటాన్ స్థాయిలు తక్కువుగా ఉంటాయి.  పిల్లలు చూసేందుకు సన్నగా ఉన్నా ఒంట్లో కోవ్వు పరంగా చూస్తే ఊబకాయం అన్నమాట. పుట్టినప్పుడు పిల్లలు సరైన భరువుతో ఉంటే పర్లేదు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు మధుమేహం,గుండె జబ్బులు వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంటుంది.  సన్నగా పుట్టిన వారు భవిష్యత్ లో బరువు పెరిగినా సమస్యే అంటున్నాయి అధ్యయనాలు. గర్భిణిగా ఉన్నప్పుడు తగినంత పోషకాహరం తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం తల్లి కడుపులోనే నిర్ణయం అయిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment