పెంపుడు ఉన్నఇళ్ళల్లో పిల్లలకు ఎక్కువ రోగనిరోధక శక్తి . ఆస్తమా,ఊబకాయం వంటి సమస్యలు ఉండవు అంటున్నారు అధ్యయనకారులు. పెంపుడు జంతువులు ఉన్న ఇళ్ళలోని పిల్లల్లో RUMINO COCCUN,OSEILLOSPERA అనే రెండు రకాల సూక్ష్మజీవుల్ని అధ్యయనకారులు గుర్తించారు. ఇవి చాలా ఉపయోగకరమైన సూక్ష్మజీవులని,ఇవి పిల్లల్లో అలర్జీలను ఊబకాయాన్ని నిరోధించేందుకు ఉపయోగపడుతాయట. పూర్వపు రోజుల్లో పిల్లలు మట్టితోనూ,పెంపుడు జంతువులతోను ఆడుకొనేవారు. అందుకే వారిలో రోగనిరోధక శక్తి ఎంతో అధికంగా ఉండేదని ఇప్పుడు తల్లులు పిల్లలను నాలుగు గోడలకే పరిమితం చేయటం వల్ల పిల్లలు ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment