Categories
నూనెతో వండిన వంటకాలు రుచి గా ఉండే మాట వాస్తవమే అయినా ఆరోగ్యం కోసం నూనె తగ్గించి వండుకోమంటున్నారు పోషకాహార నిపుణులు ప్రస్తుతం కూరగాయల సలాడ్ గా తీసుకోవటం ఆరోగ్యం అంటారు.పచ్చిగా కాకుండా కొన్ని నిమిషాలు ఆవిరి తో ఉడికించి తీసుకుంటే రుచిగా ఉంటాయి.అలాగే నూనె లేకుండా వండాలనుకున్న కూరగాయల్ని కొంచెం చిన్న మంటపై వేగనిచ్చి చివర్లో రెండు స్పూన్ల నీటిని చిమ్మి మూతపెట్టాలి.చెక్కతో చేసిన గరిటతో తిప్పాలి.గిన్నె అడుగు మాడిపోకుండా నెమ్మదిగా ఉడుకుతుంది. రుచి తగ్గకుండా నెమ్మదిగా ఉడికిస్తూ నూనె లేకుండా అన్ని రకాల కూరలు వండే విధానం యూట్యూబ్ వీడియో ల్లో ఎన్నో ఉన్నాయి.