Categories
ముఖం పైన ఉన్న యాక్నే పోయేందుకు వేప నూనె ఎంతో శక్తి మంతంగా పనిచేస్తుంది. ముఖం పైన మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారేందుకు నీమ్ ఆయిల్ ముఖ్య కారణమని చర్మ నిపుణులు చెపుతున్నారు. ఈ నూనె కేవలం మచ్చలనే కాదు చర్మం లోని బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లని తగ్గిస్తుందని చెపుతున్నారు. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇ-విటమిన్లున్నాయి. విటమిన్-ఇ తో పాటు అందులోని టై గ్లిజరైడ్స్ చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తాయి. వేప నూనె చర్మం లోపలి కణాల వరకు చేరి వాటిని శుద్ధి చేయగలదు ఫలితంగా చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుందని చెపుతున్నారు. దూదిని ఈ ఆయిల్ లో ముంచి మొటిమలు మచ్చలు ఉన్నచోట రాసి రాత్రంతా అలాగే ఉంచుకొంటే ఫలితం ఉంటుందంటున్నారు.