Categories
ఎప్పుడూ ఎక్కడైనా ఏదో రకంగా సాయం చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.అది చిన్న సాయం అయినా సరే,ఇరుగు పొరుగు కి అవసరమైన సరుకులు తెచ్చి ఇవ్వడం ప్రేమ ప్రమాదం జరిగితే తక్షణం స్పందించటం వంటివి కూడా సాయాలే కదా. కొందరూ విరాళాలు ఇస్తారు సంస్థలు నెలకొల్పటం వంటి సమాజ సేవ చేస్తారు.వాళ్లు మరింత ఆనందం తోనే ఉంటారట. దయ,సానుభూతి సాయం చేసే గుణాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి.ఈ స్వభావం శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ సాయం చేసే తత్వం చిన్నవాళ్ళ లో ఉంటే వాళ్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందనీ పెద్ద వాళ్లలో ఉంటే శారీరక ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ రకమైన సహాయ గుణం వల్ల ఆడవాళ్లు ఎక్కువ ఆనందంగా ఉంటారట.