బెంగాల్ నోక్షి పీఠా మిఠాయిలు చూసేందుకు చాలా అందమైనవి. ఇవి చేసేందుకు ఎంతో సమయం తీసుకోవటం తో దాదాపు కనిపించకుండా పోయాయి.మరిగించిన నీళ్లలో బియ్యం పిండి వేసి ఉడికించి చల్లార్చి చిన్న సైజులో అరిటాకు పైన మందమైన పూరీలా వత్తి సూదితో పుల్లలతో ఆకులు పువ్వులు, చేపల ఆకారాలు సృష్టించి, వాటిని నూనెలో వేయించి పంచదారా,లేదా బెల్లం పాకంలో వేయిస్తారు.మనకు తెలిసిన కాజాలు లాగా ఈ నోక్షి పీఠా పండగలు వేడుకల్లో నే కాదు,పిల్లల అన్నప్రాసన సమయంలో వాళ్ళ నోరు తీపి చేసేందుకు ఈ అందమైన మిఠాయిలు చేస్తారట పెద్దవాళ్ళు.యూట్యూబ్ వీడియోల్లో ఉన్నాయి చూసి నేర్చుకోవచ్చు.

Leave a comment