Categories

ఈ సృష్టిలో కనిపించే ప్రతి రంగు కళ్ళ ని ఆకట్టుకుంటుంది. ఈ వర్ణాలు ప్రాంతీయ జాతి మత భేదాలు లేకుండా ప్రతి మనిషిలో ఒకే రకమైన భావోద్వేగాలు కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరు ఖండాల్లోని 30 దేశాల్లోని 20 వేల మందిని ఎంపిక చేసి చేసిన సర్వే లో 12 రంగుల ను చూపించి వాళ్లకు ఏమనిపిస్తుందీ అడిగితే ప్రతి రంగం పట్ల దాదాపు అందరూ ఒకే అభిప్రాయం చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రంగులపై సాంప్రదాయాల గుర్తులుంటాయి వాటి వరకు వదిలేస్తే వర్ణాలు అన్ని దేశాల ప్రజలలో ఒక భావోద్వేగం కలిగించాయని రుజువైంది.