మీ ఇంట్లో నూ ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది. నన్ను అడ్డుకుంటే గాంధీ జయంతి రోజు సత్యాగ్రహం చేస్తానని పోలీస్ లను అడ్డుకుంది ప్రతిమా మిశ్రా. హోత్రాస్ ఘటన బాధితురాలిని కుటుంబీకులకు ఇవ్వకుండా ఊరి బయట దహనం చేసిన దృశ్యాలను చిత్రీకరించి ప్రపంచానికి చూపించింది ప్రతిమ మిశ్రా.యువత భారత దేశం దృష్టిని హత్రాస్ వైపు తిప్ప గలిగింది ప్రతిమ. ముంబై కు చెందిన ప్రతిమ మహారాజా అగ్రసేన్ కాలేజీ నుంచి జర్నలిజం లో డిగ్రీ తీసుకుంది.హూ యమ్ ఐ వేర్ డు ఐ స్టాండ్ అంటూ ట్రాన్స్ జెండర్ ల వేతలపైన తొలిసారిగా ఒక ఈ కథనాన్ని అందించింది.మెహసానా, బెచారా గ్రామాల్లో ఇప్పటికీ ఉన్న వర్ణ వివక్ష పై కథనాలను చిత్రీకరించింది. ఈ కథనానికి ఆమెకు రామ్ నాథ్ గోయెంకా అవార్డ్ వచ్చింది.