Categories
మనుష్యులలో కొన్ని ఉత్తమ లక్షణాలు ఉంటాయి.వాటిని కోరి నేర్చుకోమంటారు జ్ఞానులు.ఈ మాటలు మాట్లాడితే మనకు అయిష్టం అనిపిస్తుందో, ఏ పని మనకు బాధ కలిగిస్తుందో,అలాంటివి ఇతరుల కు ఎప్పుడు చెయ్యకూడదు కోపం ద్వేషంతో,ఎవ్వరినీ దూరం చేసుకోకూడదు. కళ్ళకు కనిపించినవన్నీ కావాలని అనుకోకూడదు.సభ్యతతో ప్రవర్తించాలి.ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అర్హులైన వారిని గౌరవించాలి. మర్యాద తో మాట్లాడాలి దానంగా ఇస్తే తిరిగి తీసుకోకుండా ఉండాలి అలాగే ఇచ్చిన దానాన్ని పదిమందికి ప్రచారం చేసుకోకూడదు దీనివల్ల దాన ఫలం కూడా దక్కదు.నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి వీనులవిందుగా ఉండాలి సరళంగా, ప్రియంగా, హితంగా ఉండాలి .సత్యాన్ని అనుసరించాలి సత్యం తో కూడిన వాక్కుకు ప్రాణం ఉంటుంది అంటారు పెద్దవాళ్లు.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134