Categories
జీవితంలో మూడు విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి శ్రద్ధ విశ్వాసం ప్రేమ ఇవి మనిషి ఉన్నతమైన పధం చేర్చేందుకు సోపానాలు శ్రద్ధ తో ఏదైనా సాధించవచ్చు. సూర్యకిరణాలను ఒక బిందువు దగ్గర బూతద్దంలో కేంద్రీకరిస్తే అక్కడ అగ్ని ప్రజ్వరిల్లినట్లు శ్రద్ధ ద్వారా సమస్త శక్తులను ఏకం చేయవచ్చు. దేనికైనా శ్రద్ధతో నేర్చుకోవాలి అలాగే చేస్తున్న పని పట్ల విశ్వాసం ఎంత కఠినమైన కార్యాన్నైనా సరళం చేస్తుంది. ఆ పని పట్ల ప్రేమ దాన్ని సులభంగా సాధించేలా చేస్తుంది. ఎవరైతే ఈ మూడు లక్షణాలను తనలో ఉంచుకోగలరో వారికి ఎలాంటి కష్టతరమైన కార్యమైనా అత్యంత సులభంఅయి తీరుతుంది.వ్యక్తిత్వంతో ఈ మూడు లక్షణాలు ఉండాలి.
చేబ్రోలు శ్యాంసుందర్
9849524134