Categories
చెరువుల్లో కొలనుల్లో విరిసే తామర పువ్వులను ఇప్పుడు కుండీల్లో బౌల్ లలో పెంచుకోవచ్చు పసుపు, తెలుపు, ఎరుపు, గులాబీ రంగులో విభిన్నమైన షేడ్స్ లో పూసే ఈ మినీ లోటస్ లను గాలి వెలుతురు తగిలే చోట ఇళ్లల్లో పెంచుకోవచ్చు. వీటిని దుంప వేళ్ళు విత్తనాల ద్వారా పెంచుతారు.చిన్నసైజు కుండీల్లో సూచించిన విధంగా ఇసుక మట్టి నీళ్లు పోసి విత్తనాలు లేదా దుంప పాతాలీ.ఆకులు వచ్చే వరకు ఎండ అవసరం ఉండదు.తరువాత ఏడెనిమిది గంటలు ఎండ పడే చోట ఉంచాలి.పదిహేను రోజులకు కొకసారి ఎరువు వేస్తే చాలు అందమైన పద్మాలని ఇంట్లోనే కనువిందుగా చూసుకోవచ్చు.