Categories
చీరకట్టుతో సోలో ట్రావెలర్ గా అజంతా మహాపాత్ర ఇప్పటి వరకు 68 దేశాలు తిరిగింది అన్ని దేశాలలో మనకు పనికి వచ్చేదొకటే భాష. అదే సంజ్ఞాభాష అంటుంది అజంతా.ఆమె సొంత ప్రాంతం ఒరిస్సా ఆమెకు చీరకట్టు అంటే ఇష్టం ఆమె ఇన్స్టాగ్రామ్ హాండిల్ పేరు ‘ది ట్రావెలింగ్ శారీ’. అజంతా ప్రపంచం చుట్ట బెట్టాలనుకుంది అదీ భారతీయత ప్రతిబింబించే కట్టుబొట్టు తో చిన్నప్పటి నుంచి కొత్త ప్రాంతాలు చుట్టే అలవాటున్న అజంతా మహాపాత్ర అలా దేశాలు పర్యటిస్తూ తన అనుభవాలను సోషల్ మీడియా లో రాసింది ఆమె ఒక రకంగా భారతదేశానికి అనధికారీ పర్యటక రాయబారి. గుంపుగా ప్రయాణిస్తే వినోదం కానీ ఒంటరి ప్రయాణం మన గురించి మనకు చెబుతోంది అంటుంది అజంతా.