కరోనా పై యుద్ధం కాదు,కలిసి కట్టుగా నిర్ములిద్దాం అంటూ న్యూజీలాండ్ ప్రజల్లో ఆత్మస్థయిర్యం నింపింది ఆదేశ యువ ప్రధాని  జసిండా ఆర్డెర్న్ కోవిడ్ -19 ను పూర్తిగా అరికట్టిన,జీరో కేసులున్న దేశంగా న్యూజీలాండ్ చరిత్రకెక్కింది. దేశంలో తోలి వంద కేసులు రిజిస్టర్ కాగానే  ‘గో హార్డ్‌ అండ్‌ గో ఎర్లీ’ అంటూ కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించింది ప్రధాని జసిండా. కరోనా పరీక్షలు వేగవంతం చేయించింది. విదేశాలతో పోలిస్తే అత్యధికంగా మూడు లక్షల కరోనా టెస్ట్ లు చేసిన దేశంగా న్యూజీలాండ్ పేరు తెచ్చుకొంది. ప్రధాని చెప్పిన ఆదేశాలు అక్షరాలా పాటించారు ప్రజలు. ఇప్పుడు న్యూజీలాండ్ లో పరిస్థితి దారికొస్తోంది. ప్రజా జీవితం ప్రశాంతంగా ఉంది.

Leave a comment