కోవిడ్ -19 వ్యాప్తి భయంతో శుభ్రత పట్ల శ్రద్ధ అందరికీ ఎక్కువైంది.పాదాలు శుభ్రంగా కడుక్కొంటూ ఉంటాము కానీ పాద రక్షలు బయటే వదిలేస్తాము. వాటిని వెంటనే గాలి చొరబడనీయకుండా స్టాండ్ లో పెట్టేస్తే అపటికే చెమట తో తడిగా ఉన్న పాదరక్షల పైన ఫంగస్ విస్తరిస్తుంది. మార్కేట్ లో డిస్పోజబుల్ వెట్ వైప్స్ దొరుకుతున్నాయి. బయట నుంచి రాగానే ఈ వైప్ తో పాదరక్షల లోపల బయట శుభ్రం చేస్తే వ్యాధికారిక క్రిములు నశిస్తాయి. అల్ట్రా వయొలెట్ షూ శానిటైజర్లు మార్కెట్లో దొరుకుతాయి దీనితో పాదరక్షల్లో వుండే ఫంగస్ బాక్టీరియా పోతాయి. జోన్ శానిటైజేర్ డ్రయ్యర్ పరికరం తో చెప్పులను చాలా తేలికగా శుభ్రం చేయవచ్చు.

Leave a comment