బంధాలు అనుబంధాలు మనం పుట్టేక ఏర్పడినవే.వీటిని శ్రద్ధగా పెంచి పోషించి కొంటేనే నిలుస్తాయి.మనం ఎవరి కడుపున పుడతామో మన చేతుల్లో లేదు. ఏ భాషా, ఏ ప్రాంతం, ఏ సంస్కృతి, ఏ మతం అన్ని విషయాలు మనం పుట్టిన తర్వాత మనం జీవించే చోట మన ఉనికిని బట్టి వచ్చి చేరతాయి.వయసు వచ్చాక క్రమంగా అర్థం చేసుకోవలసిన అంశాలు ఇవి. నిజానికి ఏ మతం, సంస్కృతి హింసను ప్రేరేపించదు అన్ని మతాల సారం నియమబద్ధమైన జీవితమే.పొరుగు వారిని సోదరులుగా చూడమనే  చెప్తాయి మత గ్రంథాలు ఇలా వసుదైక కుటుంబ భావనని నింపిన పెద్దలు.
సహనా వవతు సహనౌ భునక్తు అన్న శ్లోకం చెపుతూ చివర్లో శాంతితో ముగిస్తారు. తనకు తాను శాంతిగా, ఇతరులతో శాంతంగా ప్రపంచాన్ని ప్రేమతో చూడగలిగితే జీవితం సాఫీగా నడిచిపోతుంది.

చేబ్రోలు శ్యామసుందర్  
9849524134 

ReplyForward

Leave a comment