మలయాళం సినిమా జల్లికట్టు విడుదలకు ముందే అనేక ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సేరీ ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.కథ విషయానికి వస్తే కేరళలో అటవీప్రాంతం దగ్గర లో ఒక ఊరు. విస్సెంట్ అడవి దున్న మాంసం ఊరందరికీ అమ్ముతుంటాడు ఎప్పటిలాగే ఒక అడవి దున్నను నరికేందుకు సిద్ధపడితే అది కాస్త ఆ ఊరిని తన పశుబలంతో వణికించి నానా బీభత్సం చేసి అడవిలోకి పారిపోతుంది. ఆ అడవి దున్నను చంపేందుకు ఊరు ఊరంతా ఏకమై అడవిలోకి అడుగుపెడతారు మనిషికి, తనకు మురుగానికి ఉన్న చిన్న గీతను ఎంత తేలికగా దాటేసి తనలో ఉన్న పశు ప్రవృత్తిని బయటికి తీయగలిగారో ఆ రాత్రి అడవిదున్న వేటలో కనిపిస్తుంది.దాన్ని చంపే క్రమంలో మనిషి మృగం లోకి పరకాయ ప్రవేశం చేయడం చూపించారు.దర్శకుడు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తప్పనిసరిగా చూడండి.
రవిచంద్ర. సి
7093440630