వర్షాలు పడితే దోమలు వచ్చేస్తాయి . దోమతెరలు కట్టుకోవడం తప్ప వేరే అప్షన్ ఉండదు . దోమల మందులు అందరికి పడవు . కానీ ఈ దోమతెరలు రాజ భవనాల్లో రాజకుమార్తెలు వేసుకొనేట్లు కనిపిస్తే . బెడ్ కి జాలువారే పరదాలతో ఉండేలా ఇప్పుడు ప్రత్యేకమైన రాయిల్స్ లేదా రాడ్స్ వచ్చాయి . ఇవి రక రకాలైన సైజుల్లో ఆకారాల్లో ఉన్నాయి వీటిని మంచానికి బిగించి వాటి పైన అందమైన చక్కని రంగుల దోమతెరలు కప్పేస్తే చాలు . ఇవి మంచానికి నాలుగువైపులా ,మంచాన్ని రౌండ్ గా చుట్టేస్తూ రకరకాల డిజైన్లు వచ్చాయి . ఇటు అందంగా ఉండాలి అటు దోమల బెడద తప్పులు అంటే ఇవి కొనుక్కొంటే చాలు . ఇల్లే రాజమందిరంలా కనిపిస్తుంది .

Leave a comment