ఉత్తర ధృవం మీదుగా బోయింగ్ విమానాన్ని నడిపి 16 వేల కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసిన పైలెట్ తన్మయి పాపగారి. ఉత్తర ధృవం మీదుగా బోయింగ్ విమానాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళురుకు కెప్టెన్ జోయసింగ్ తో పాటు మరో ఇద్దరు మహిళా పైలెట్ లతో విజయవంతంగా పూర్తిచేసింది తన్మయి. మాతో పాటు ప్రయాణం చేస్తున్న 235 మంది ప్రయాణికులు 12 మంది క్యాబిన్ క్రో బాధ్యత మాదే కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ధైర్యంతో ముందడుగు వేశాం ఆంటోది తన్మయి. ఎయిర్ ఇండియా పైలెట్ గా 15 ఏళ్ళ అనుభవం వుంది తన్మయికి.. ప్రస్తుతం బోయింగ్ 777 విమానానికి కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది.