Categories
మానసిక ఒత్తిడి తగ్గించటంలో ముందుంది మష్రూమ్ టీ. రుచిగా ఆరోగ్యంగా ఉండటం తో పాట వీటిలో పీచు ప్రొటీన్లు విటమిన్లు ఖనిజాలు ఎసెన్సియల్ న్యూట్రి యాంట్లు పుష్కలంగా ఉన్నాయి.ఈ టీ తాగితే తప్పనిసరిగా బరువు తగ్గుతారు అంటారు ఎక్సపర్ట్స్. వీటిలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మష్రూమ్ క్యూబ్స్ నీ పొడిగా చేసి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు ఈ టీ తయారవుతుంది. వీటిలో ఉండే పోషకాలు పీచు, విటమిన్ల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది. ఫ్లూ జ్వరాలు, ఇతర అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.