పేదింటి పిల్లలు ఏం చేయాలన్నా అడ్డంకులే కానీ వాళ్ళు ఎందుకు సాధించ కూడదు అనుకున్నాను అంటుంది మాన్య సింగ్ ఆటో రిక్షా డ్రైవర్ కూతురు ఇవాళ ఆమె మిస్ ఇండియా రన్నర్-అప్. నేను అందాల పోటీలో పాల్గొనాలని అనుకున్నాను పేదింటి అమ్మాయిల పక్షాన నా గొంతు నేను వినిపించాలనుకోన్నాను పద్నాలుగేళ్ళ వయసులో ఇంట్లోంచి పారిపోయి ముంబై వచ్చి అక్కడ పిజ్జా హౌస్ లో పని వెతుక్కొని చదువుకున్నాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2020 లో ఎంట్రీ పొందాను ఇది ఎంతో దీర్ఘమైన ప్రయాణం ఇప్పుడూ నా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ల బాధ్యత నేను తీసుకోగలను అని చెబుతోంది మాన్య సింగ్.