నలభై ఏళ్ళ తర్వాత మహిళలు పాప్‌స్మియర్ , మామోగ్రఫీలు తప్పని సరిగా చేయించుకోవాలంటున్నాయి పరిశోధనలు. ఇటీవల కాలంలో మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ దృష్ట్యా హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) పరీక్షను ఐదేళ్ళకు ఒక సారి చేయించుకోవాలి.  రొమ్ము క్యాన్సర్ గుర్తింపు కోసం చేసేది మామోగ్రఫీ.  కుటుంబంలో పెద్ద వాళ్ళకి ఈ క్యాన్సర్ ఉండి ఉంటే 40 ఏళ్ళ ముందుగానే ఈ పరీక్షలు తప్పనిసరి . 40 ఏళ్ళ నుంచి మహిళలు తమ స్తన పరీక్ష చేసుకోవాలి. నొక్కి చూసుకుంటూ ఎక్కడైన గట్టిగా అనిపించినా, ఎర్రగా కందినట్లుగా ఉన్న వెంటనే డాక్టర్ ను కలుసుకోవాలి. సెర్వికల్ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్ లు ముదిరిపోకముందే గుర్తించి వైద్యం చేయించుకొంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Leave a comment