మాది కడప జిల్లా ఎర్రగుంట్ల ఎంఏ చదివిన వెంటనే తెలంగాణ ఆర్కియాలజీ మ్యూజియం లో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడి 12 గ్యాలరీల సంరక్షణ నాదే 1930 నుంచి మ్యూజియంలో ఉన్న యువరాణి నసిహు (20) మమ్మీ బాధ్యత కూడా నాదే ..
,దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మమ్మీ ఇదే చెక్క బాక్స్ లో ఉండే మమ్మీ కాస్త పాడవటం కనిపించింది దానికి సిటీ స్కాన్ చేయించి జర్మనీ నుంచి తెప్పించిన గాజు పెట్టెలో పెట్టి భద్రత చేయించాను. ఆ పెట్టెలో పూర్తిగా నైట్రోజన్ వాయువు ఉండేలా మిషన్ ఏర్పాటు చేశాం అంటున్నారు మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ బి గంగాదేవి. తప్పకుండా అందరూ చూడవలసిన యువరాణి మమ్మీ ఇది 2500 సంవత్సరాల క్రితం టోలెమీ వంశానికి చెందిన రాకుమారి. ఈమె 20 ఏళ్ళ వయసులో ఈమె మరణించాక మమ్మీ గా మార్చారు తప్పకుండా చూడవలసిన అపురూపమైన సంపద ఇది అంటోంది గంగాదేవి.