Categories
![ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక పోవటం ఇలా కారణాలు ఏమైనా నడుము కింది భాగంలో వెన్నునొప్పి తో బాధపడేవాళ్లు సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ప్రతి పదిమందిలోను ఎనిమిదిమంది దీని బారిన పడుతున్నారని అధిక బరువు ఎత్తటం క్షణం కూడా తీరిక లేని అనేక పనులు పదే పదే చేస్తూ ఉండటం కూడా మరో ముఖ్య కారణమని పరిశోధకులు చెపుతున్నారు . ఇందులో రెండు రకాల్ని ఒకటి దీర్ఘ కాలికంగా వస్తూ పోతుందని ఒకటి ఉదయం పూట ఎక్కువగా ఉంటుందనీ విశ్లేషించారు. తొలిదశలోనే కారణం తెలుసుకుని బరువులు ఎత్తటం ,దించటం ఆపాలనీ యోగా చేయాలనీ కూర్చునే భంగిమలు మార్చుకోవాలని వాటి ద్వారా దీన్ని నివారించుకుంటే మంచిదని చెపుతున్నారు. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నెప్పి తీవ్ర స్థాయికి చేరుతుందని అది దీర్ఘకాలికంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు . నడుం నొప్పి కదా ఒక మాత్రతో పోతుందని ఆలస్యం చేయద్దంటున్నారు](https://vanithavani.com/wp-content/uploads/2017/03/back-pain.jpg)
సాధారణంగా కూర్చునే విధానం సరిగా లేకపోతే వెన్ను సమస్యలు అధికమవుతాయి. ప్రతిరోజు కూర్చుని నిలబడటం ,సైకిల్ తొక్కటం వంటి సరళమైన జీవనశైలి మార్పులు వెన్ను సమస్యలను తగ్గిస్తాయి. ఫోన్ లో మాట్లాడే సమయంలో పొత్తికడుపు బిగుతుగా ఉంచాలి. భుజాలు గుండ్రంగా ఉంచాలి. బ్యాక్ సపోర్ట్ లేకుండా నిటారుగా ఉండాలి మొబైల్ ని కంటికి సమానమైన దూరంలో ఉంచాలి. వీపు నిటారుగా ఉంచాలి. హై హిల్స్ వీలైనంత తక్కువ సమయం వాడటం, ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం నిల్చోవడం కాకుండా శరీరాన్ని అప్పుడప్పుడూ కదిలించటం కంప్యూటర్ టీవి వంటివి చూసేప్పుడు, లేదా టేబుల్ మీల్స్ చేసేప్పుడు సరైన ఎత్తులో ఉంచుకోవటం ద్వారా మెడపై భారం లేకుండా చేయాలి.