ఫ్యాషన్ అంటే ధనవంతులకే సొంతం అనుకుంటారు అదేం నిజం కాదు.నేను మధ్యతరగతి నుంచి ఫ్యాషన్ స్థాయికి ఎదిగాను ఫ్యాషన్ గా ఉండాలి అంటే రోజు కొత్తగా ట్రెండీ గా ఉండేందుకు ప్రయత్నిం చేయాలి. అంతే అంటోంది ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, యూట్యూబర్ కోమల్ పాండే. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల కోమల్ పాండే ౨౦౧౫ లో లుక్ ఆఫ్ ది డే పేరుతో ఫ్యాషన్ కెరీర్ ప్రారంభించింది.యూట్యూబ్ లో ఫ్యాషన్ వీడియోలు చేస్తోంది. ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు హానర్ వివో గార్నియర్ మెచ్లిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించింది.