సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు చుస్తే వాటిలో మూడువంతులు అమ్మాయి కావాలనే అడిగినవే. గత మూడేళ్ళుగా ఈ గణాంకాలను చూసినా  60 శాతం మంది ఆడపిల్లలనే అభిర్దిస్తున్నారట. అనాధశ్రమాల  నుంచి పిలల్లను  దత్తత తీసుకోవాలనుకునే వారికోసం దేశవ్యాప్తంగా 400 దత్తత కేంద్రాలున్నాయి. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా సంతానం లేనివాళ్లు ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో కుడా  ఆడపిల్లల పైనే ఆసక్తి.

మగపిలల్ల కన్నా ఆడపిల్లలనే  తల్లితండ్రుల వల్ల ఎక్కువ ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారని తేలటమే ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కాకపోతే దత్తతకు సంబంధించిన నియమనిబంధనలు కఠిన తరంగ వుంటాయి. కనుక ఎక్కువ మంది ఈ కేంద్రాల పట్ల ఆసక్తి చూపరు. కానీ గణాంకాలు చూసి మాత్రం ఆడపిల్లల విషయంలో సింగిల్ పేరేంట్స్ పిల్లలు లేని దంపతులు ఆసక్తి చూపించటం పట్ల సామజిక విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment