Categories
సాధారణంగా స్త్రీలు సుకుమారంగా ఉంటారని దేన్నీ తట్టుకోలేరని, మగవాళ్ళు దృఢంగా మానసికంగా శక్తివంతులని అనుకుంటారు కానీ మగవాళ్ళ కన్నా స్త్రీలే ఎక్కువ బాధని తట్టుకొంటారు అంటున్నారు మియామి యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్ నిపుణులు.నొప్పిని తట్టుకునే సామర్థ్యం ఆడవాళ్ళకే ఉంటుందని వారి పరిశీలనలో తేలింది. కొంతమందికి ఒకే రకమైన నొప్పి కలిగించి పరిశీలిస్తే కాస్త బాధని కూడా మగవాళ్లు తట్టుకోలేక పోయారని స్త్రీలు కాస్త నొప్పిని అసలు పట్టించుకోలేదని వీడియో రికార్డ్ ద్వారా పరిశీలించి తేల్చారు. స్త్రీలు మరీ అంత సుకుమారులు ఏమీ కాదు అంటున్నారు.