ఏ రుచి కావాలన్నా నిముషంలో రెడీ. ఏ దేశ వంటకమైనా, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నాన్ వెజ్ లు ఎలా వండుకోవాలో షెఫ్ లు కొలతలతో సహా వండి వార్చి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటే, అమ్మాబాట పిల్లల కైనా వంట ఈజీ. గంట సేపు రకరకాలు ఎవరు వందగలరు, బోర్…. అనేసి పిల్లలు నీరస పడకుండా డివైడెడ్ పాట్ గిన్నెలోచ్చాయి. మార్కెట్ లో వున్న ఈ డివైడెడ్ పాట్ వంట పాత్రలు, పాన్ లు స్టీలు పాత్రలు, మూతలు వేరువేరుగా వచ్చాయి. ఒకే సారి ఒకే పాన్ లో రెండు మూడు రకాలు వందేయచ్చు. పులుసు, కూర, వేపుడు ఒకే సారి చేయచ్చన్నమాట. ఒకే గిన్నెలో రెండు మూడు వంటలన్నమాట. ఆన్ లైన్ లో చూసి ఆర్డరిస్తే రేపటి వంటకు సిద్దంగా ఇంటి కోచ్చేస్తారు.

Leave a comment