భారత ప్రభుత్వం కోవిడ్ పేషెంట్లు సహజసిద్ధమైన పద్ధతిలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని సూచనలు చేసింది. రోజుకు ఐదు సార్లు రంగుల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి వీటివల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు విటమిన్లు అందుతాయి .70 శాతం కోకోవా ఉన్న డార్క్ చాక్లెట్ ని కొద్ది మొత్తంలో తీసుకోవటం వల్ల మనసులో ఒత్తిడి తగ్గుతుంది .గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని ప్రతిరోజు తాగాలి భోజన విరామ సమయంలో స్మూతీ లు  పెరుగు, చీజ్ ఉడికించిన ఆలుగడ్డ వంటివి తినచ్చు. రాగులు, ఓట్స్ వంటి తృణధాన్యాలతో చేసిన పదార్ధాలు తినాలి. యోగ బ్రీతింగ్ ఎక్సర్ సైజులు వ్యాయామాలు క్రమశిక్షణతో చేయాలి.

Leave a comment