ఈ ప్రపంచంలో జంతువులను ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు . ఎంతో దయా దాక్షిణ్యం ఉంటే గానీ వాటిని పెంచలేరు . డేవిడ్ షెల్డ్రిక్ వైల్డ్ ఆఫ్ ట్రస్ట్ అనే సంస్థ గున్న ఏనుగుల కోసం ఒక అనాధాశ్రమం నడుపుతుంది . వేటగాళ్ళ వల్ల ,కరువు కారణంగాను చనిపోయిన ఏనుగుల పిల్లలను తెచ్చి అవి పెరిగి పెద్దయ్యే వరకు పెంచుతారు . మళ్ళీ అడవుల్లో వదిలేస్తారు . తల్లితో బలమైన అనుబంధాన్ని పెంచుకొనే ఏనుగు పిల్లలు తల్లి లేకుండా బతకలేవట . అందుకే ఈ ఆశ్రమంలో వాటికీ ప్రతి మూడుగంటలకు పాలు పట్టిస్తూ మట్టితో ఆటలాడిస్తూ ఎంతో శ్రద్ధతో ప్రేమగా చూసుకొంటారు .

Leave a comment